Chandrababu Naidu: మీకు ఆ సందేహం ఎందుకొచ్చింది?
Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ ఎన్డీయేతో కలవదన్న సందేహం ఎందుకొచ్చింది అని మీడియా వర్గాలను ప్రశ్నించారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. నిన్న నరేంద్ర మోదీతో పాటు ఎన్డీయే కూటమిలోని పెద్దలతో ఢిల్లీలో సమావేశమయ్యారు చంద్రబాబు. సమావేశం అనంతరం ఆయన బయలుదేరుతుండగా సర్ మీరు కూటమికి మద్దతు ఇస్తున్నారా? అని మీడియా వర్గాలు ప్రశ్నించాయి. దీనికి చంద్రబాబు సమాధానమిస్తూ.. “” అసలు మీకు ఆ సందేహం ఎందుకొచ్చింది? నేను ఎన్డీయేతో లేకపోతే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తాం అనుకున్నారు? మేమంతా కలిసే పోరాడి గెలిచాం. మీకు ఆ సందేహం ఎందుకొచ్చిందో అర్థంకావడంలేదు “” అన్నారు.