Twitter: ట్విటర్‌లో పోర్న్ కంటెంట్‌కు అనుమతిచ్చిన మస్క్
Twitter: ఎక్స్ (ట్విటర్)లో ఇక నుంచి పోర్న్ వీడియోలు షేర్ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు యజమాని ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించారు. ఇక నుంచి యూజర్లు పరస్పర అంగీకారంతో సెక్సువల్ కంటెంట్ పోస్ట్‌లు చేయచ్చు. అయితే ఈ పోర్న్ కంటెంట్ పోస్ట్ చేసే ముందు వార్నింగ్, డిస్‌క్లైమర్ వంటివి యాడ్ చేయాల్సిందేనని మస్క్ తెలిపారు. 18 ఏళ్లు లోపు యూజర్లకు ఈ కంటెంట్ పోస్ట్ చేసేందుకు కానీ చూసేందుకు కానీ అవకాశం లేదు.
ట్విటర్ ఖాతాల్లో సరైన పుట్టిన తేదీలు నమోదు కాకపోయినా వారు కూడా ఈ పోర్న్ కంటెంట్ పోస్ట్ చేసేందుకు అనర్హులే. ఒకవేళ గైడ్‌లైన్స్ మితిమీరి పోస్ట్‌లు పెడితే మాత్రం ట్విటర్ వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ట్విటర్ ప్రొఫైల్ ఫోటోలు, బ్యానెర్లపై పోర్న్ ఫోటోలు పెట్టుకోవడం కుదరదు. ట్విటర్ చేసిన రీసెర్చ్ ప్రకారం.. ట్విటర్ టైమ్‌లైన్‌లో పోర్న్ వీడియోలు, పోర్న్ కంటెంట్ కనిపిస్తే వెంటనే రిపోర్ట్ కొడుతున్నారట. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం ట్విటర్, రెడిట్‌లో పోర్న్ కంటెంట్‌కు అనుమతిస్తున్నందుకు యాపిల్, గూగుల్ సంస్థలను తప్పుబట్టింది.