SVSN Varma: జగన్.. నువ్వు చర్లపల్లి జైలుకే
SVSN Varma: ఇక జగన్ మోహన్ రెడ్డి చర్లపల్లి జైలుకి వెళ్లడం తథ్యం అని అన్నారు తెలుగు దేశం పార్టీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గెలవాలని వర్మ తన కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి పవన్ గెలుపుకు ప్రధాన కారణంగా మారారు. ఈ నేపథ్యంలో వర్మ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు అహంకార నేతలకు చెంపపెట్టు లాంటిదని.. ఇక జగన్ చర్లపల్లి జైలుకి వెళ్లడం ఒక్కటే మిగిలి ఉందని అన్నారు. ముద్రగడ పద్మనాభం పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని సవాల్ విసరడంపై ఆయన స్పందించారు. పేరు మార్చుకోవడం అనేది ఎవరి ఇష్టం వారిదని.. దానికి ఓ ప్రక్రియ ఉంటుందని ఆయన పేరు మార్చుకోవడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.