కుబేరులు పేదలుగా మారితే…!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ రోజుకో కొత్త పుంత‌లు తొక్కుతోంది. దీని సామ‌ర్ధ్యాన్ని స‌రిగ్గా వినియోగించుకుంటే వండర్స్ సృష్టిస్తుంద‌ని ఇప్ప‌టికే ఎన్నో ఏఐ ఫీచ‌ర్లు రుజువుచేసాయి. మ‌రోప‌క్క చాట్ జీపీటీ వంటి ఏఐ చాట్ టూల్స్ కారణంగా ఎక్క‌డ ఉద్యోగాలు పోతాయోన‌ని ఐటీ ఉద్యోగులు కంగారుప‌డుతున్నారు. ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే.. ఈ ఏఐ టూల్‌తో ఫొటోల‌ను రీక్రియేట్ చేసి వావ్ అనిపిస్తున్నాడు గోకుల్ అనే ఏఐ ఆర్టిస్ట్. ప్ర‌పంచ కుబేరులు పేద‌లుగా మారితే ఎలా ఉంటారో తెలుసా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోల‌ను షేర్ చేసాడు. అందులో బిల్ గేట్స్, ఎలాన్ మ‌స్క్, మార్క్ జ‌క‌ర్‌బ‌ర్గ్, డొనాల్డ్ ట్రంప్, ముఖేష్ అంబానీ, వారెన్ బ‌ఫెట్, జెఫ్ బేజోస్ ఉన్నారు. వీరంతా ఓ స్ల‌మ్ ఏరియాలో బ‌నియ‌న్లు, లుంగీలు, చొక్కాలు లేకుండా అస‌లు సిస‌లైన పేద‌లుగా మార్చి.. వీరికి స్ల‌మ్‌డాగ్ మిలియ‌నీర్లు అని పేరు కూడా పెట్టాడు. ప్ర‌పంచ‌కుబేరులు.. పేద‌లుగా మారితే ఎలా ఉంటారో మీరూ చూసేయండి.