పార్టీ అధినేతల్లో పవన్‌కే ఆధిక్యం
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టాప్ పెర్ఫార్మర్ ఎవరైనా ఉన్నారంటే అది జనసేనాని పవన్ కళ్యాణ్. పోటీ చేసిన 21 సీట్లలో ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. వీఐపి సీట్లలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్.. 70,354 ఓట్ల ఆధిక్యంతో గెలిచేసారు. ఈ మార్క్ ఇంకా ఏ పార్టీ అధినేత దాటలేదు.