Hardik Natasa: పెళ్లి ఫోటోలు ప్రత్యక్షం.. విడాకులు లేనట్లేనా?
Hardik Natasa: ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తన భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడిపోనున్నారని కొంతకాలంగా పెద్ద చర్చ జరుగుతోంది. నటాషా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని తన పేరు నుంచి పాండ్య పేరుని తీసేయడం.. పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ విడాకుల రచ్చ మొదలైంది. కనీసం అందులో ఎలాంటి నిజం లేదని ఇద్దరికి ఇద్దరు చెప్పకపోవడంతో వీరిద్దరూ విడిపోతున్నారనే అనుకున్నారు.
పాండ్య.. నటాషాను ఓ రెస్టారెంట్లో కలిసాడని.. ఆ తర్వాత ఇద్దరూ డేటింగ్ చేయడం వల్ల ఆమె గర్భం దాల్చిందన్న టాక్ ఉంది. దాంతో ఇక చేసేదేంలేక ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారట. అయితే పెళ్లికి ముందే నటాషా పాండ్య ఒక అగ్రీమెంట్కి వచ్చారట. అదేంటంటే.. విడిపోయే సమయంలో పాండ్య నుంచి 70 శాతం వాటా తనకు రావాలని నటాషా కోరిందని టాక్. అందుకే నటాషా ప్లాన్ ప్రకారం విడిపోతోందని ఆమెపై ట్రోలింగ్, నెగిటివిటీ మొదలైంది. అయితే.. ఇప్పుడు నటాషా ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలు మళ్లీ దర్శనమిస్తున్నాయి. దాంతో ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని వారిద్దరూ విడిపోవడం లేదనే ప్రచారం జరుగుతోంది.