Shraddha Kapoor: అలాగైతేనే మళ్లీ ప్రభాస్‌తో నటిస్తా
Shraddha Kapoor: ప్రభాస్, శ్రద్ధా కపూర్ కలిసి సాహో సినిమాలో నటించారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. కానీ వీరిద్దరి పెయిర్ బాగుందని చాలా మంది అన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఎప్పుడు ప్రభాస్‌తో నటిస్తారు మేడమ్ అని ఓ అభిమాని శ్రద్ధా కపూర్‌ను అడిగాడు. ఇందుకు శ్రద్ధ స్పందిస్తూ.. మళ్లీ ఎప్పుడైతే నాకు ప్రభాస్ ఇంటికి భోజనం పంపిస్తాడో అప్పుడు తప్పకుండా నటిస్తాను అని చెప్పారు. అందరికీ కడుపు నిండా భోజనం పెట్టించడంలో ప్రభాస్ ముందుంటారు. సమయం సందర్భం ఏదైనా భోజనాలు పెట్టించేస్తుంటాడు. సాహో షూటింగ్ సమయంలోనూ శ్రద్ధా కపూర్‌కు తాను ఎప్పుడూ చూడనని దక్షిణాది వంటకాలను తెప్పించి కడుపు నించా భోజనం పెట్టించేవాడని శ్రద్ధా కూడా తెలిపింది.