ఇంట్లోకి చొర‌బ‌డి ఏసీలో నిద్ర‌పోయిన దొంగ‌.. నిద్ర‌లేపిన పోలీసులు

thief dozed off in doctor home

Viral News: పాపం ఎండ‌ల‌కు త‌ట్టుకోలేక ఓ దొంగ ఇంట్లోకి చొర‌బ‌డి ఏసీ ఉంది క‌దా అని హాయిగా ప‌డుకున్నాడు. కాసేపు సేదతీరి ఆ త‌ర్వాత వ‌చ్చిన ప‌ని కానిద్దాం అనుకుని నిద్ర‌పోయాడు. తీరా నిద్ర లేచి చూసేస‌రికి పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌ఖ్‌నౌలో చోటుచేసుకుంది. శ‌నివారం అర్థ‌రాత్రి ఓ దొంగ పీక‌ల‌దాకా తాగి ఓ వైద్యుడి ఇంట్లోకి చొర‌బ‌డ్డాడు. దొంగ‌త‌నం చేద్దాం అనుకున్నాడు కానీ.. ఏసీ ఉండ‌టంతో కునుకు ప‌ట్టేసింది. అయితే ఆ స‌మ‌యంలో వైద్యుడు అస‌లు ఇంట్లో లేడు. గేటు తెరిచి ఉండ‌టాన్ని గ‌మ‌నించి ప‌క్కింటి వాళ్లు వైద్యుడికి ఫోన్ చేసారు. దాంతో ఆయ‌న పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేసారు. పోలీసులు సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ దొంగ‌ను నిద్ర‌లేపి అదుపులోకి తీసుకున్నారు.