Hardik Pandya: నేను పారిపోయే టైప్ కాదు
Hardik Pandya: జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా తాను భయపడి పారిపోయే టైప్ కాదని అన్నారు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య. 2024 పాండ్యకు కలిసి రాలేదనే చెప్పాలి. ఐపీఎల్‌లో ఓటమి.. వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఇలా పాండ్య ఒకదాని తర్వాత ఒక సమస్యతో ఎంతో బాధపడుతున్నాడు. పైకి మాత్రం ధైర్యంగానే కనిపిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ప్రస్తుతం పాండ్య అమెరికాలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో పాండ్య ఓ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఐపీఎల్ ఓటమి గురించి స్పందించారు.
“” ఒక్కోసారి జీవితంలో ఎత్తుపల్లాలు వస్తూనే ఉంటాయి. అలాగని యుద్ధ భూమినే వదిలేసి వెళ్లిపోతే ఎలా? ఒక్కోసారి ఆటలో మనం ఓడిపోవచ్చు. మనం అనుకున్న స్కోర్ రాకపోవచ్చు. అలాగని ఆట ఆపేస్తే నాకు జీవితం ఎక్కడుంటుంది?బాధ లేదు అని చెప్పడం లేదు. చాలా బాధగా ఉంది. నేను విజయాలను సీరియస్‌గా తీసుకోను. నేను గెలిస్తే కొన్ని క్షణాలు ఆనందపడి ఆ తర్వాత నా ఆటతీరును ఇంకెంత మెరుగుపరుచుకోవాలా అని ఆలోచిస్తాను. ఓడిపోయినప్పుడు కూడా అంతే. నేను భయంతో పారిపోయే టైపైతే కాదు “” అని తెలిపారు.