AP Election Exit Poll: మెజారిటీ YSRCPదే.. ఇతని ఎగ్జిట్ పోల్స్ తప్పలేదు
AP Election Exit Poll: సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ రచ్చ మొదలైపోయింది. ఇప్పటికే ABP C ఓటర్, పబ్లిక్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు కూటమిదే అంటున్నాయి. ఇంకా అసలు సిసలైన ఎగ్జిట్ పోల్స్ మరికాసేపట్లో వెలువడతాయి. అయితే ఇప్పుడు మనం ఒక కీలక వ్యక్తి చేసే ఎగ్జిట్ పోల్ సర్వే గురించి తెలుసుకుందాం. అతని పేరు పార్థా దాస్. ఈయన ఎన్నికల ఫలితాల ఎనలిస్ట్. బెంగళూరు IIMలో చదివి పేరుగాంచిన సెఫాలజిస్ట్ (పొలిటికల్ రిజల్ట్ ఎనలిస్ట్). 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈయన వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ 80% కరెక్ట్‌గా వచ్చాయి. దాంతో ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టారు. పార్థా దాస్ విశ్లేషణ ప్రకారం ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
పురుషులు అత్యధికంగా తెలుగు దేశం పార్టీకి ఓట్లు వేసారు
మహిళా ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటేసారు
పురుష ఓటర్ల నేపథ్యంలో చూసుకుంటే తెలుగు దేశం పార్టీ కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 4 శాతం ఓట్ల తేడాతో వెనుకంజలో ఉంది.
ఇక మహిళా ఓటర్ల విషయంలో చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తెలుగు దేశం పార్టీ కంటే 12 శాతం ఓట్ల షేర్‌తో ముందంజలో ఉంది.
ఫైనల్ ఓటు షేర్ ఇలా ఉంది
YSRCP – 50%
TDP కూటమి – 46%
కాంగ్రెస్ (ఇండియా కూటమి) – 2.5%
ఇతరులు – 1.5%
సీట్ల షేరింగ్ ఇలా
YSRCP – 110-120
TDP కూటమి – 55-65