నేను అదే ఆశిస్తున్నాను సామ్: అఖిల్
సినీ నటి సమంత, నాగచైతన్యలు విడిపోయి దాదాపు 4 ఏళ్లు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే సమంత మాత్రం అక్కినేని ఫ్యామిలీకి ఓ మంచి సన్నిహితురాలిగానే ఉంటోంది. ముఖ్యంగా నాగార్జున, రానా, రానా భార్య మిహీక, అఖిల్‌లతో సమంత ఇప్పటికీ టచ్‌లో ఉన్నారు. కాగా..నిన్న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సామ్ సోషల్ మీడియా వేదికగా విష్ చేసారు. అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్‌డే అఖిల్.. ఏజెంట్ 28న రిలీజ్ అవబోతోంది. సినిమా అద్భుతంగా ఉండబోతోంది” అని విష్ చేసారు. దీనికి అఖిల్ స్పందిస్తూ.. “థ్యాంక్యూ సో మచ్ సామ్. నీ అంచనాలు అందుకుంటానని ఆశిస్తున్నాను” అని తెలిపాడు. సామ్‌కు మయోసిటిస్ వ్యాధి సోకిందని తెలిసినప్పుడు నాగార్జున, అఖిల్, రానా ఆమెను పరామర్శించారు. అప్పుడప్పుడు సామ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కాల్స్ చేస్తుంటానని రానా కూడా పలు సందర్భాల్లో తెలిపారు.