యూర‌ప్‌లో నాగ చైత‌న్య‌, శోభిత‌.. వైన్ టేస్ట్ చేస్తూ..

Naga Chaitanya: స‌మంత‌తో విడిపోయాక నాగ చైత‌న్య‌.. శోభిత ధూళిపాల‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్నాడ‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిద్ద‌రూ క‌లిసే వెకేష‌న్ల‌కు వెళుతూ వేరు వేరుగా ఒకే చోట నుంచి ఫోటోలు పెడుతున్నారు. లండ‌న్‌లో ఓ భార‌తీయ చెఫ్ పుణ్య‌మా అని వీరిద్ద‌రి తొలి ఫోటో బ‌య‌టికి రావ‌డంతో మ్యాట‌ర్ బ‌య‌ట‌పడింది.

ఇప్పుడు నాగచైత‌న్య‌, శోభిత‌కు సంబంధించిన మ‌రో ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీరిద్ద‌రూ యూర‌ప్‌లో వైన్ టేస్టింగ్ యాక్టివిటీలో పాల్గొన్న‌ట్లు ఆ ఫోటోను బ‌ట్టి తెలుస్తోంది. ప్ర‌స్తుతం త‌మ రిలేష‌న్‌షిప్‌ని కొంత‌కాలం పాటు ఎంజాయ్ చేయాల‌నుకుంటున్నారని.. పెళ్లి చేసుకోవాల‌ని అనిపించిన‌ప్పుడు వారే వివ‌రాలు అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని స‌న్నిహితులు తెలిపారు.