భారతదేశంలో మొదటి సెక్స్ కుంభకోణం.. జగ్జీవన్ రాం పరువు పోయిన వేళ
Sex Scandal: ప్రస్తుతం దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన అంశం ఏదన్నా ఉందంటే అది కర్ణాటకకు చెందిన ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవెగౌడ మనవడైన ప్రజ్వల్.. దాదాపు 3000 మంది మహిళలపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మొన్నటి వరకు జర్మనీలో దాక్కున్న ఈరోజు ఉదయం బెంగళూరుకు చేరుకోవడంతో పోలీసులు వెంటనే అరెస్ట్ చేసారు. సరిగ్గా లోక్ సభ ఎన్నికల సమయంలో ఈ కుంభకోణం బయటికి రావడంతో జేడీ(ఎస్) పార్టీ ఇరకాటంలో పడింది.
అయితే భారతదేశంలోనే మొట్ట మొదటి సెక్స్ కుంభకోణం 1978 ఆగస్ట్‌లో జరిగింది. ఈ కుంభకోణం వల్ల దివంగత నేత బాబూ జగ్జీవన్ రామ్ ప్రధానమంత్రి కాలేకపోయారు. అప్పటి స్టోరీ ఏంటో తెలుసుకుందాం. 1978లో జగ్జీవన్ రామ్ కుమారుడు సురేష్ రామ్ తన ప్రియురాలు సుష్మా చౌదరితో కలిసి కారులో బయటికి వెళ్లారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు వీరిపై దాడి చేసి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మోదీ నగర్‌కు వెళ్లాలని డిమాండ్ చేసారు. ఆ తర్వాత సురేష్‌ను బాగా కొట్టి అతను స్పృహ కోల్పోగానే సుష్మిను కిడ్నాప్ చేసారు. స్పృహ వచ్చాక సురేష్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగినదంతా చెప్పాడు. దాంతో పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకుని విచారణ చేపట్టగా.. సెక్స్ కుంభకోణం బయటపడింది.
అప్పటికి జగ్జీవన్ రామ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా ఉన్నారు. ఆ తర్వాత ప్రధాని అయ్యే అవకాశం ఆయనకే రావాల్సి ఉంది. కానీ ఎప్పుడైతే సురేష్ ఈ సెక్స్ కుంభకోణంలో ఉన్నాడని తేలిందో జగ్జీవన్ రామ్ పరువుపోయింది. అతనిపై అప్పటి వార్తాపత్రికలు దారుణంగా రాసి తలెత్తుకోకుండా చేసాయి. దాంతో ఆయన ప్రధాని కాలేకపోయారు. ఆ తర్వాత కొన్ని నెలలకు సురేష్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో జగ్జీవన్ రామ్ మానసికంగా కుంగిపోయారు. అయితే ఇప్పటికీ జనాల్లో ఉండే టాక్ ఏంటంటే.. అప్పట్లో ఇందిరా గాంధీకి కాంగ్రెస్ కుటుంబానికి జగ్జీవన్ రామ్ ప్రధాని అవ్వడం ఇష్టం లేకే అతని కుమారుడిని సెక్స్ కుంభకోణంలో ఇరికించారని అంటుంటారు.