Paris Olympics 2024: క్రీడాకారుల కోసం యాంటీ సెక్స్ బెడ్స్.. అస‌లేంటివి?

all you need to know about anti sex beds for Paris Olympics 2024 athlets

Paris Olympics 2024: ఈసారి ఒలింపిక్ క్రీడ‌లు జులై 26 నుంచి ఆగ‌స్ట్ 11 వ‌ర‌కు పారిస్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి. ఎప్పుడైతే ఒలింపిక్ క్రీడ‌ల తేదీని ప్ర‌క‌టించారో అప్ప‌టినుంచి ఈ యాంటీ సెక్స్ బెడ్స్ హాట్ టాపిక్‌గా మారింది.  క్రీడ‌ల‌కు సెక్స్‌కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఈ ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు త‌మ‌కు న‌చ్చిన వారితో సెక్స్ చేసుకునే అవ‌కాశం ఉంద‌ని పారిస్ ఒలింపిక్స్ మేనేజ్‌మెంట్ ప్ర‌క‌టించింది. ఇది వారికేమీ కొత్త కాదు. 1980ల నుంచి ఈ ఆన‌వాయితీ ఉంది. క్రీడాకారులు త‌మ న‌చ్చిన తోటి క్రీడాకారుల‌తో సెక్స్‌లో పాల్గొన‌వ‌చ్చు. ఇందుకోసం మేనేజ్‌మెంట్ వేలాది కండోమ్‌లు కూడా పంపిణీ చేస్తున్నారు. వీరి కోసమ‌నే ఈ యాంటీ సెక్స్ బెడ్స్ తెప్పించారు.

ఇంత‌కీ ఏంటీ యాంటీ సెక్స్ బెడ్స్?

ఎయిర్‌వీవ్ అనే జ‌ప‌నీస్ కంపెనీ ఈ యాంటీ సెక్స్ బెడ్స్‌ని రూపొందించింది. ఈ ఒలింపిక్స్ కోస‌మ‌ని దాదాపు 16000 బెడ్స్‌ని పారిస్‌కు పంపించింది. దాదాపు 440 పౌండ్ల బ‌రువును మోసే సామ‌ర్ధ్యం ఈ ప‌రుపుల‌కు ఉంది. అయితే క్రీడాకారులు ఎలాంటి శృంగార కార్య‌క్ర‌మాల్లో పాల్గొనకుండా ఉండేందుకు ఈ బెడ్స్ తెప్పించిన‌ట్లు పారిస్ ఒలింపిక్స్ మేనేజ్‌మెంట్‌పై వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై మేనేజ్‌మెంట్ స్పందిస్తూ.. త‌మకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోస‌మే ఈ కార్డ్‌బోర్డ్ బెడ్స్ తెప్పించామ‌ని వెల్ల‌డించింది.