కారు లుక్ మార్పిస్తున్నారా? జైలుకెళ్తారు జాగ్ర‌త్త‌!

modifying your car can land you up in jail

Car: కొత్త కారు కొన‌లేని వారు ఆల్రెడీ ఉన్న కారుకే మెరుగులు దిద్దాల‌ని అనుకుంటారు. అయితే కార్ల‌కు మాడిఫికేష‌న్లు చేయ‌డం వ‌ల్ల జ‌రిమానా లేదా జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది. భార‌త ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల ప్ర‌కారం కార్ల‌కు ఎలాంటి మాడిఫికేష‌న్లు చేయ‌డం వ‌ల్ల ఇబ్బందులు వ‌స్తాయో తెలుసుకుందాం.

కారులోని ఫ్రండ్, రియ‌ర్ విండోల నుంచి 70% లోప‌లి భాగం క‌నిపించేలా ఉండాలి. సైడ్ విండోస్ నుంచి 50% క‌నిపించాలి. డార్క్ టింట్ వేయించుకోవ‌డం నేరం.

కార్ల‌లో బుల్ బార్స్ పెట్టించుకోవ‌డం నేరం. బుల్ బార్ అంటే మీ వాహనం ఫ్రంట్ ఎండ్‌ను ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌ల సమయంలో కానీ లేదా ఏవైనా జంతువులు ఢీకొన్నప్పుడు ముందు భాగం విరిగిపోకుండా ఈ బుల్ బార్స్ .పెడుతుంటారు. ఇలాంటి పెట్టిస్తే లోప‌ల ఎయిర్ బ్యాగ్స్ ప‌నిచేయ‌వు.

ఫ్యాన్స్ నెంబ‌ర్లు, డెక‌రేష‌న్ చేసిన నెంబ‌ర్ ప్లేట్లు ఉండ‌కూడ‌దు. 3D హాల్‌మార్క్‌తో IND లెట‌రింగ్‌తో అత్య‌ధిక సెక్యూరిటీ సంఖ్య‌ల‌ను నెంబ‌ర్ ప్లేట్లుగా పెట్టించుకోవాలి.

ఒక కారు బ్రాండ్‌ను మ‌రో బ్రాండెడ్ కారులా మారిస్తే నేరుగా జైలుకే. ఉదాహ‌ర‌ణ‌కు మీ వ‌ద్ద సెడాన్ కారు ఉంద‌నుకోండి.. దానిని బెంజ్‌గా త‌యారు చేయించి వాడుకుంటానంటే కుద‌ర‌దు.

RTO అనుమ‌తి లేకుండా కారులోని ఇంజిన్‌ని కూడా మార్పించ‌కూడ‌దు.

రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్ కారు ఛాసిస్, ఇంజిన్ నెంబ‌ర్‌తో మ్యాచ్ అవ్వాలి. లేదంటే రూ.5000 జ‌రిమానా లేదా ఆరు నెల‌లు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది.