హిందూ ముస్లింల పెళ్లి వ‌ర్తించ‌దు.. హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

madhya pradesh high court shocking verdict on hindu muslim marriage

Marriage: ఓ జంట పెళ్లి విష‌యంలో మ‌ధ్య ప్ర‌దేశ్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. వధూవ‌రులు హిందూ ముస్లిం కావ‌డంతో వారి పెళ్లి చ‌ట్ట విరుద్ధ‌మ‌ని అస‌లు చెల్ల‌ద‌ని తీర్పు ఇచ్చింది. 1954 ప్ర‌త్యేక వివాహ చ‌ట్టం కింద పెళ్లి చేసుకోవాల‌నుకున్నా కూడా అది చెల్ల‌ద‌ని హైకోర్టు జడ్జి తెలిపారు. ముస్లిం యువ‌కుడిని పెళ్లి చేసుకునే ముందు త‌మ కూతురు ఇంట్లో ఉన్న న‌గ‌ల‌న్నీ తీసుకుని వెళ్లిపోయింద‌ని.. ఈ పెళ్లికి ఒప్పుకోవ‌ద్ద‌ని యువ‌తి త‌ల్లిదండ్రులు కోర్టులో పిటిష‌న్ వేసారు.

మ‌రోప‌క్క పెళ్లి చేసుకోవాల‌న్న యువ‌తీ యువ‌కుడు మాత్రం త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు. ఇరు వైపు వాద‌న‌లు విన్న జ‌డ్జి.. ఈ పెళ్లి చ‌ల్ల‌ద‌ని తీర్పు ఇచ్చారు. మ‌రోప‌క్క యువ‌తి ముస్లింగా మారేందుకు కానీ యువ‌కుడు హిందూగా మారేందుకు గానీ ఒప్పుకోక‌పోవ‌డంతో కోర్టు ఈ కేసుపై ఇక వాద‌న‌లు వినేందుకు ఒప్పుకోలేదు. వీరిద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేసేందుకు కూడా ఒప్పుకోలేదు.