Jio: జియో నుంచి త‌క్కువ ధ‌ర‌ల‌కే బోలెడు ప్లాన్స్

jio air fiber to launch cheapest plans

Jio:  భార‌త‌దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆప‌రేట‌ర్ అయిన రిల‌య‌న్స్ జియో నుంచి త‌క్కువ ధ‌ర‌కే కొత్త ప్లాన్స్ త్వ‌ర‌లో లాంచ్ అవుతున్నాయి. ప్ర‌స్తుతానికి జియో ఎయిర్ ఫైబ‌ర్ దాదాపు 115 న‌గ‌రాల్లో అందుబాటులో ఉంది. ప్ర‌స్తుతానికి జియో ఎయిర్ ఫైబ‌ర్ నుంచి 6 నుంచి 12 నెల‌లకు సంబంధించిన ప్లాన్స్ మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అతి త‌క్కువ ధ‌ర‌కే ఎక్కువ జీబీలో 3 నెల‌ల ప్లాన్స్‌ని లాంచ్ చేయ‌నున్నారు.

కొత్త ప్లాన్స్ ఇవే:

రూ.1797కే 30 Mbps స్పీడ్‌తో 1000 జీబీ ప్లాన్ (3 నెల‌లు). దీంతో పాటు వివిధ ఓటీటీల‌కు సంబంధించిన స‌బ్‌స్క్రిప్ష‌న్లు కూడా ఉచితం.

రూ.2697కి 100 Mbps ప్లాన్ (14 ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు ఉచితం)

రూ.3597కి 17 ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు

300, 500 Mbps, 1 జీబీతో అధిక స్పీడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.

జియో ఎయిర్ ఫైబ‌ర్ తీసుకునేవారికి ఒక వైఫై రూటర్, 4K స్మార్ట్ సెటాప్ బాక్స్, వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్ ఇస్తారు.