Vishwak Sen: బాల‌కృష్ణ సీటు కింద లిక్క‌ర్.. అదంతా గ్రాఫిక్స్

Vishwak Sen says liquor bottle below balakrisha seat is cg

Vishwak Sen: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అతిథిగా వ‌చ్చిన నంద‌మూరి బాల‌కృష్ణ కుర్చీ కింద వాట‌ర్ బాటిల్‌లో లిక్క‌ర్ ఉండ‌టం పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. ఆ లిక్క‌ర్ బాటిల్ బాల‌య్య‌దే అని.. ఆయ‌న తాగి ఈవెంట్‌కి రావ‌డ‌మే కాకుండా ఆ మైకంలో హీరోయిన్ అంజ‌లిని ప‌క్క‌కు తోసేసార‌న్న టాక్ వినిపిస్తోంది. దీనిపై నిర్మాత నాగ‌వంశీ.. న‌టుడు విశ్వ‌క్‌సేన్ స్పందించారు. అస‌లు అక్క‌డ లిక్క‌ర్ సీసా లేద‌ని.. అది గ్రాఫిక్స్ అని చెప్పి వారి ప‌రువు వారే తీసుకున్న‌ట్ల‌య్యింది. ఈవెంట్ మొత్తం తానే ద‌గ్గ‌రుండి చూసుకున్నాన‌ని.. బాల‌య్య కూర్చునే సీటు కింద అలాంటి బాటిల్స్ పెట్టేంత ధైర్యం ఎవ‌రికి ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు.