Mammootty: నేను చ‌నిపోయాక ఎవ్వ‌రూ గుర్తుంచుకోన‌క్క‌ర్లేదు

Mammootty says he doesn't want people to remember him after his death

Mammootty: నేను చ‌నిపోయాక న‌న్నెవ్వ‌రూ గుర్తుంచుకోవాల్సిన అవ‌స‌రం లేదు అన్నారు మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి.  త‌న చివ‌రి శ్వాస వ‌ర‌కు యాక్టింగ్ ఆప‌న‌ని.. ఇంకా సినిమాలు చేయాల‌నుకుంటున్నాన‌ని తెలిపారు. ఓ యూట్యూబ‌ర్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌మ్ముట్టి ఈ వ్యాఖ్య‌లు చేసారు. “” నాకు ఓపిక ఉంది. చ‌చ్చే వ‌ర‌కు న‌టిస్తూనే ఉంటా. నేను పోయాక న‌న్నెవ్వ‌రూ గుర్తుపెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేదు. అయినా ఎవ‌రైనా ఎంత కాల‌మ‌ని గుర్తుపెట్టుకుంటారు. సంవ‌త్స‌రం, ప‌ది సంవత్స‌రాలు.. ఆ త‌ర్వాత మ‌ర్చిపోతారు. అయినా నేనొక్క‌డినే న‌టుడిని కాదు క‌దా. వేలాది మంది న‌టుల్లో నేనొక‌డిని. న‌న్ను మాత్ర‌మే ఎందుకు ప్ర‌త్యేకించి గుర్తుంచుకుంటారు? గొప్ప గొప్ప వాళ్ల‌ను అతి త‌క్కువ స‌మ‌యంలోనే మ‌ర్చిపోతారు “” అని తెలిపారు.