శృతి కామెంట్..చిరు గురించేనా?
మెగాస్టార్ చిరంజీవితో కలిసి శృతి హాసన్ వాల్తేరు వీరయ్య సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడం ఇదే మొదటిసారి. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందుకు శృతి.. వాల్తేరు వీరయ్య సినిమా గురించి చేసిన కామెంట్లే కారణమని తెలుస్తోంది. ఓ సందర్భంలో శృతి ఇంటర్వ్యూల సమయంలో వాల్తేరు వీరయ్య సినిమాలో శ్రీదేవి చిరంజీవి అనే పాట గురించి ప్రస్తావించారు. ఈ పాటలో శృతి, చిరంజీవి మంచు కురుస్తున్న ప్రదేశంలో పాటను షూట్ చేసారు. అయితే అలాంటి చల్లటి ప్రదేశాల్లో తనకు షూటింగ్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, హీరోలకేమో జాకెట్లు, శాలువాలు లాంటివి ఇస్తారు కానీ హీరోయిన్లు మాత్రం పల్చటి చీరలతో డ్యాన్స్ చేయాల్సి వస్తుందని అన్నారట. దాంతో మెగాస్టార్ ఫ్యాన్స్.. శృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికీ ఓకే చెప్పి సినిమా చేసాక ఇప్పుడు కంప్లైంట్లు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. అంతేకాదు వాల్తేరు వీరయ్యకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్లలోనూ శృతి పాల్గొనలేదు. కానీ అదే సమయంలో రిలీజ్ అయిన వీర సింహారెడ్డి ప్రమోషనల్ ఈవెంట్లకు హాజరయ్యారు.