Nita Ambani: నీతా అంబానీ తాగే నీళ్లు.. నీళ్ల బాటిల్ ధ‌రెంతో తెలుసా?

know the worth of water bottle from which nita ambani drinks from

Nita Ambani:  రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీ దంప‌తుల గురించి ప్ర‌తీ విష‌యం ఆశ్చ‌ర్య‌క‌రంగానే ఉంటుంది. ఇండియాలోనే అత్యంత ధ‌నిక కుటుంబం అయిన అంబానీ ఇంట ఏ వేడుక జ‌రిగినా ప్ర‌పంచమంతా క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తుంది. ఈరోజు నుంచి జూన్ 1 వ‌ర‌కు అంబానీ ఇంట పెళ్లి వేడుక జ‌ర‌గ‌బోతోంది.

అంబానీ దంప‌తుల చిన్న వార‌సుడు అనంత్ అంబానీ.. రాధిక మ‌ర్చెంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటలీలోని ఓ క్రూజ్ షిప్‌లో జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో నీతా అంబానీకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వైర‌ల్ అవుతోంది. అదేంటంటే.. నీతా అంబానీ వ‌ద్ద ఓ వాట‌ర్ బాటిల్ ఉంది. అది ఆమెకు ఎంతో ప్ర‌త్యేకం. ఎప్పుడు నీళ్లు తాగాల‌నిపించినా ఆ బాటిల్ నుంచే తాగుతుంటారు. ఆ బాటిల్ ధ‌రెంతో తెలుసా? అక్ష‌రాలా రూ.49 ల‌క్ష‌లు. ఆమె తాగే నీళ్లు కూడా సాధార‌ణంగా ల‌భించే మిన‌ర‌ల్ వాట‌ర్ కూడా కాదు. ఆక్వా డి క్రిస్టిల్లో ట్రిబ్యుటో మోడీగ్లియానీ అనే బ్రాండ్‌కి చెందిన నీళ్లు మాత్ర‌మే తాగుతారు. ఇవి ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన నీళ్లు.

అంత‌గా ఈ నీటిలో ఏముంది అనుకుంటున్నారా? ఈ నీళ్ల‌లో గోల్డ్ పార్టిక‌ల్స్ ఉంటాయ‌ట‌. వీటి వ‌ల్ల నిత్యం చ‌ర్మం య‌వ్వ‌నంగా క‌నిపిస్తుంటుంద‌ట‌. ఆ వాట‌ర్ బాటిల్ కూడా స‌గం బంగారంతోనే డిజైన్ చేసారు. ఫిజి, ఫ్రాన్స్ దేశాల నుంచి వ‌సంత రుతువు స‌మ‌యంలో వ‌చ్చే నీటి ద్వారా నేచుర‌ల్‌గా త‌యారుచేయ‌బ‌డిన గోల్డెన్ వాట‌ర్‌ను నీతా అంబానీ తాగుతారు.