వివాహమైన 12 రోజుల తర్వాత భార్య మగాడని తెలిసి..
Indonesia: అమ్మాయి ఎంతో పద్ధతిగా ఉందని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తికి ఎవ్వరికీ ఎదురవకూడని అనుభవం ఎదురైంది. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఓ మగాడని పెళ్లయ్యాక తెలిసింది. దాంతో అతను పాపం ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాడు. ఈ ఘటన ఇండోనేసియాలో చోటుచేసుకుంది.
2023లో వ్యక్తి అడిందా కాన్జా అనే యువతిని సోషల్ మీడియాలో ద్వారా కలిసాడు. అతను కలిసినప్పుడు అడిందా బుర్ఖా ధరించి ఉంది. అయితే ముస్లిం వారికి అది సంప్రదాయం కాబట్టి అతను కూడా బుర్ఖా తీయమని కానీ ముఖం చూపించాలని కానీ అడగలేదు. అడిందా నచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటావా అని అడగా.. ఇందుకు ఆమె ఒప్పుకుంది. అయితే తనకు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవ్వరూ లేరని తాను ఒంటరిగానే ఉంటున్నానని చెప్పింది. అలా వీరిద్దరూ ప్రైవేట్ వేడుకలా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలోనూ అడిందా బుర్ఖా తీయలేదు. ఆ తర్వాత పాపం ఆ వ్యక్తి అడిందాకు మద్దు పెడదామన్నా కౌగిలించుకుందామన్నా కూడా ఒప్పుకునేది కాదు. ఇంట్లో కూడా బుర్ఖా వేసుకునే ఉండేది. శోభనం చేసుకుందాం అని అడిగితే నెలసరి వచ్చిందని ఒంట్లో బాలేదని ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేది.
దాంతో అతనికి అనుమానం వచ్చి.. అడిందాను రహస్యంగా గమనించడం మొదలుపెట్టగా అడిందా మగాడని తెలిసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఆడ వేషం వేసుకుని అబద్ధపు పెళ్లిళ్లు చేసుకుని ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతుంటారట. దాంతో పోలీసులు అడిందాను అదుపులోకి తీసుకున్నారు.