పెళ్లి స‌మ‌యానికి మాట మార్చిన వ‌ధువు.. వ‌రుడి ఆత్మ‌హ‌త్య‌

bride refuses to marry her boyfriend leading to his suicide

Marriage: కొంత‌కాలం పాటు ప్రేమించి తీరా పెళ్లి స‌మ‌యానికి వ‌ధువు మాట మార్చ‌డంతో వ‌రుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. బాలాఘాట్ జిల్లాకు చెందిన ఆశిష్ అనే 24 ఏళ్ల కుర్రాడు అదే ప్రాంతానికి చెందిన యువ‌తితో కొంత‌కాలంగా ప్రేమ‌లో ఉన్నాడు. వీరిద్ద‌రి పెళ్లి స్థానిక కోర్టులో జ‌ర‌గాల్సి ఉంది. పెళ్లి స‌మ‌యానికి వ‌ధువులా ముస్తాబై వ‌చ్చిన యువ‌తి.. కోర్టులో పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో ఆశిష్ కుంగిపోయాడు. ఏం జ‌రిగిందో కూడా ఆ అమ్మాయి చెప్ప‌క‌పోవ‌డంతో విషం తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.