AI ద్వారా మహిళా టీచర్‌గా నమ్మించి.. ఏడుగురిపై రేప్
Viral News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి ఓ వ్యక్తి ఏడుగురు ఆడపిల్లలను లొంగదీసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సిధి జిల్లాకు చెందిన బ్రజేష్ అనే వ్యక్తి ఏఐ ద్వారా మహిళా టీచర్‌లా గొంతు మార్చి ఆడపిల్లలను టార్గెట్ చేసి వారితో ఫోన్‌లో మాట్లాడేవాడు. తనకు ఓ విద్యా సంస్థ ఉందని దాని ద్వారా ఉచితంగా స్కాలర్‌షిప్ వచ్చేలా చేస్తానని చెప్పి నమ్మబలికాడు. ఆసక్తి ఉన్నవారు తనకు అడ్రెస్ పంపితే తన కుమారుడు దగ్గరుండి విద్యా సంస్థకు తీసుకొస్తాడని చెప్పాడు. ఇలా ఏడుగురు అమ్మాయిలు అడ్రెస్ ఇవ్వడంతో వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నలుగురు అమ్మాయిలు తమ వాంగ్మూలం ఇవ్వడంతో కేసు స్ట్రాంగ్‌గా మారింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టి నిందితుడికి కఠిన కారాగార శిక్ష పడేలా చేస్తున్నారట.