Anjali: గేమ్ ఛేంజ‌ర్ గురించి మాట్లాడొద్ద‌న్నారు

 

anjali-says-she-cannot-speak-about-game-changer

Anjali: రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా గురించి త‌న‌ను ఎవ్వ‌రితోనూ మాట్లాడ‌ద్ద‌న్నార‌ని అన్నారు న‌టి అంజ‌లి. అంజ‌లి కూడా గేమ్ ఛేంజ‌ర్ సినిమాలో రెండో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతూనే ఉంది. ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానిపై క్లారిటీ రాలేదు. ఈ నేప‌థ్యంలో అంజలి సినిమా గురించి ప్ర‌స్తావించారు. ఎక్క‌డా కూడా ఈ సినిమా గురించి అప్డేట్ ఇవ్వ‌ద్ద‌ని టీం నుంచి త‌న‌కు అల్టిమేటం అందింద‌ని.. ఈ సినిమా గురించి రామ్ చ‌ర‌ణ్ కానీ శంక‌ర్ కానీ లేదా నిర్మాత దిల్ రాజు కానీ చెప్తార‌ని త‌న‌ని అడిగి ఇబ్బంది పెట్టొద్ద‌ని తెలిపింది.