Sujeeth: OG కంటే ముందు రీమేక్ అనుకున్నా

sujeeth says he was supposed to do a remake with Pawan Kalyan Garu

Sujeeth:  ర‌న్ రాజా ర‌న్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తా నిరూపించుకున్నాడు సుజీత్. ఆ త‌ర్వాత ప్ర‌భాస్‌తో తీసిన సాహో అస్సాం అయిన‌ప్ప‌టికీ.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేత ఓజీకి ఒప్పించాడు. ఇప్పుడు ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే ఓజీ కంటే ముందు ప‌వ‌న్‌తో ఓ రీమేక్ తీయాల‌నుకున్నాన‌ని అన్నాడు సుజీత్.

“” ప‌వ‌న్‌తో ఓ సినిమా చేయాల‌ని నాకు ఓ నిర్మాత నుంచి కాల్ వ‌చ్చింది. అయితే రీమేక్ అయితే బాగుంటుంద‌ని అన్నారు. కానీ నేను ఒరిజిన‌ల్ స్టోరీనే తీస్తాన‌ని చెప్పాను. ల‌క్కీగా అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి ఓజీ కుదిరింది. నిజానికి నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌లిసిన‌ప్పుడు ఒరిజిన‌ల్ క‌థ ఉందా అని అడిగారు. అప్పుడు ఆయ‌న‌కు ఓజీ గురించి చెప్పిన‌ప్పుడు వెంట‌నే ఒప్పుకున్నారు“” అని తెలిపారు