Devara: సంద్రం న‌డుమ స‌మ‌రం

devara to fight with 10000 men

Devara: ఎన్టీఆర్ (JR NTR) న‌టిస్తున్న దేవ‌ర‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైర‌ల్ అవుతోంది. ఇందులో తార‌క్ ర‌క్ష‌కుడి పాత్ర‌లో నటిస్తున్నారు. స‌ముద్ర తీరం చుట్టూ ఉన్న ప‌ది గ్రామాల‌కు ర‌క్ష‌కుడిగా తార‌క్ పాత్ర ఉండ‌బోతోంది. ఈ గ్రామాలు.. స‌ముద్రంలో ఉన్న విలువైన వ‌స్తువుల‌ను దొంగిలించేందుకు ఓ ముఠా ప్ర‌య‌త్నిస్తుంటే వారితో స‌ముద్రం మ‌ధ్య‌లో తార‌క్ పోర‌టాం చేయ‌నున్నార‌ట‌. దాదాపు ప‌ది వేల మందితో సంద్రం న‌డుమ స‌మ‌రం ఉండబోతోంద‌ని తెలుస్తోంది. ఇలా ఒక్కో ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌టికి వచ్చే కొద్దీ దేవ‌ర‌పై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి.