War 2: తార‌క్‌కు పోటీగా మ‌రో ద‌క్షిణాది హీరో

war 2 will also feature dhruv sarja

War 2: జూనియ‌ర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో హృతిక్ రోష‌న్‌తో తార‌క్ త‌ల‌ప‌డ‌నున్నారు. అయితే వార్ 2లో తారక్‌కు పోటీగా మ‌రో ద‌క్షిణాది హీరోను ఎంపిక‌చేసిన‌ట్లు తెలుస్తోంది. అత‌నెవ‌రో కాదు.. ప్ర‌ముఖ న‌టుడు అర్జున్ స‌ర్జా మేన‌ల్లుడు, క‌న్న‌డ న‌టుడు ధృవ్ స‌ర్జా. ఇందులో ధృవ్‌కి సంబంధించి కొన్ని సీన్లు మాత్ర‌మే ఉండ‌నున్నాయ‌ట‌. వార్ 2లో తార‌క్ త‌న సోద‌రుడిని చంపిన‌వారిపై ప‌గ తీర్చుకోవాల‌ని అనుకుంటాడు. ఆ స్టోరీలైన్‌లో భాగంగానే ఇందులో ధృవ్‌కి ఛాన్స్ దొరికిన‌ట్లు తెలుస్తోంది. బ్ర‌హ్మాస్త్ర ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ వార్ 2ని డైరెక్ట్ చేస్తున్నారు. య‌ష్ రాజ్ ఫిలింస్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. 2025లోనే ఇది అతిపెద్ద బాలీవుడ్ సినిమాగా రిలీజ్ కాబోతోంది.