బ‌ల్లి త‌ల‌పై ప‌డితే ఏం చేయాలి? తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లేంటి?

what to do when a lizard falls on your head

Lizard: బ‌ల్లి త‌ల‌పై ప‌డితే ఆయుక్షీణం అంటారు. దీనిని గౌలి శాస్త్రం అంటారు. బ‌ల్లి శ‌రీరంలోని ఏ భాగంలో ప‌డినా వాటికి దాని వ‌ల్ల మంచి కానీ చెడు కానీ జ‌రుగుతుంద‌ని న‌మ్ముతారు. మ‌న శ‌రీరంలోని దాదాపు 65 భాగాల్లోని ఏ భాగంలో అయినా బల్లి ప‌డితే ఈ గౌలి శాస్త్రం చూస్తారు.

బ‌ల్లి ఏ భాగాల్లో ప‌డితే వాటి అర్థాలేంటో తెలుసుకుందాం

త‌ల‌పై ప‌డితే – ఆయుక్షీణం, అనారోగ్య స‌మ‌స్య‌లు

త‌ల వెనుక భాగంలో ప‌డితే – మేన‌మామ‌కు స‌మ‌స్య‌

త‌ల‌కు కుడి వైపు ప‌డితే – సోద‌రుడికి స‌మ‌స్య‌

జుట్టుపై ప‌డితే – అన్ని ర‌కాల స‌మ‌స్య‌లు

ప‌రిహారాలు ఏంటి?

ఒంటిపై ఏ భాగంలో బ‌ల్లి ప‌డినా ముందు స్నానం ఆచ‌రించి ఇంట్లో దీపం పెట్టాలి. మ‌హామృత్యుంజ‌య మంత్రం జ‌పించి మ‌ట్టి దీపాలు, నువ్వులు వంటివి దానం చేయాలి. కాంచీపురంలోని వ‌ర‌ద‌రాజ పెరుమాల్ ఆల‌యంలో ఉన్న బంగారు వెండి బ‌ల్లిని తాకితే అన్ని దోషాలు పోతాయ‌ని న‌మ్ముతారు. ఒక‌వేళ మీరు బంగారు, వెండి బ‌ల్లిని ద‌ర్శించ‌క‌పోయి ఉంటే.. మీపై బ‌ల్లి ప‌డిన‌ప్పుడు మీ ఇంట్లో వారు ఎవ‌రైనా ఆ బంగారు బ‌ల్లిని ద‌ర్శించుకున్న వారు ఉంటే వారికి తెలీకుండా కాళ్ల‌కు న‌మ‌స్క‌రించినా దోషాలు పోతాయ‌ని పెద్ద‌ల మాట‌.