AP Elections: జూన్ 4.. చంద్ర‌బాబుకు క‌లిసొచ్చేనా?

will chandrababu naidu wins only 4 mla seats in ap elections

AP Elections:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు జూన్ 4న వెలువ‌డ‌నున్నాయి. ఈ ఫ‌లితాల కోసం ఊపిరి బిగ‌ప‌ట్టి మ‌రీ ఎదురుచూస్తున్నారు రాష్ట్ర ప్ర‌జ‌లు, నేత‌లు. అయితే జూన్ 4 తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు క‌లిసొస్తుందా అనే డిబేట్ మొద‌లైంది. చంద్ర‌బాబు నాయుడుకి క‌లిసొచ్చే సంఖ్య 9 క‌లిసి రాని సంఖ్య 7 అని ఓ జ్యోతిష్యుడు చెప్పాడు.

ఈ నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజ‌య సాయి రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో మే 23న ఫ‌లితాల వెలువ‌డ‌గా.. తెలుగు దేశం పార్టీకి కేవ‌లం 23 ఎమ్మెల్యే సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. అవి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేల‌ను లాక్కోవ‌డం వ‌ల్లే వ‌చ్చాయ‌ని అన్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ న‌లుగురు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల‌కు టికెట్లు ఇచ్చింది. ఫ్లాష్‌బ్యాక్ చూసుకుంటే 2019 మే 23న 23 సీట్లే వ‌చ్చాయి కాబ‌ట్టి.. ఈసారి జూన్ 4న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి కాబ‌ట్టి 4 సీట్లే గెలుస్తార‌ని విజ‌య సాయి రెడ్డి అన్నారు.