Gautam Gambhir: టీమిండియా కోచ్ ప‌ద‌వికి రెడీ

Gautam Gambhir is ready to take up team india head coach position

Gautam Gambhir: క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ మెంటార్ గౌత‌మ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ ప‌ద‌వి చేప‌ట్టేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం. 2021 నుంచి రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా ఉన్నారు. ఈ జూన్‌తో ఆయ‌న కాంట్రాక్ట్ పూర్త‌వుతుంది. దాంతో మ‌రో హెడ్ కోచ్‌ను నియ‌మించే ప‌నిలో BCCI ఉంది. రేపు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ క‌లక‌త్తా నైట్ రైడర్స్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ త‌ర్వాత చెన్నైలో గంభీర్ జై షా, రోజ‌ర్ బిన్నీల‌తో స‌మావేశం కానున్నాడు. ఒక‌వేళ గంభీర్ హెడ కోచ్‌గా నియ‌మితుడైతే మాత్రం క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ మెంటార్‌గా త‌ప్పుకోవాల్సి ఉంటుంది. కొత్త‌గా నియ‌మింప‌బ‌డే హెడ్ కోచ్ 2027లో సౌత్ ఆఫ్రికాలో జ‌ర‌గ‌నున్న ఓడిఐ వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు కొనసాగాల్సి ఉంటుంది.