NASA: మరో భూమిని కనిపెట్టిన నాసా.. మనుషులు బతికేస్తారట
NASA: నాసా మరో భూ గ్రహాన్ని కనిపెట్టేసింది. దాని పేరు గ్లీస్ 12 b. దీనిని టెస్ పద్ధతి ద్వారా కనిపెట్టినట్లు నాసా తెలిపింది. టెస్ అంటే ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే సాటిలైట్. అంటే ఆల్రెడీ ఉన్న గ్రహాన్ని పోలిన మరో గ్రహం ఏదన్నా ఉందా అని కనుగొనే ప్రక్రియ అన్నమాట. ఈ గ్లీస్ గ్రహం మన భూమి కంటే 40 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే ఇంకా 380 ట్రిలియన్ కిలోమీటర్లు దూరంలో ఉంది ఆ గ్రహం.
ట్రాన్సిట్ డిటెక్షన్ ద్వారా శాస్త్రవేత్తలు ఈ గ్లీస్ అనే మరో భూ గ్రహాన్ని కనిపెట్టారు. ట్రాన్సిట్ డిటెక్షన్ ద్వారా సౌర కుటుంబం బయట ఉంటే ఉప గ్రహాలను సులువుగా కనుక్కోవచ్చు. అయితే మానవ మనుగడకు కావాల్సిన అట్మోస్పియర్ గ్లీస్ ఉప గ్రహంపై ఉందో లేదో ఇంకా తెలియాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్లీస్ గ్రహం వీనస్ గ్రహం సైజులో ఉందట. అందుకే దీనికి ఎక్సో వీనస్ అనే మరో పేరు కూడా పెట్టారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్లీస్ ఉప గ్రహం గురించి మరింత స్టడీ చేయనున్నారు. ఒకవేళ మానవ మనుగడకు కావాల్సినవన్నీ గ్లీస్ ఉప గ్రహంపై ఉంటే భూమి తర్వాత మనుషులు జీవించేందుకు తోడ్పడే మరో గ్రహం ఇదే అవుతుంది.