ఓటేస్తూ చ‌నిపోయిన ఓట‌రు..!

old voter dies while voting

Viral News: ఆరో విడ‌త పోలింగ్‌లో భాగంగా ఓ వృద్ధుడు త‌న ఓటు హ‌క్కును వినియోగించుకుంటూనే మృతిచెందాడు. ఈ ఘ‌ట‌న జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని ర‌జౌరీ జిల్లాలో చోటుచేసుకుంది. మ‌హ్మ‌ద్ ఇక్బాల్ అనే వృద్ధుడు ఓటు వేసేందుకు చాలా సేపు నుంచి లైన్‌లో నిల‌బ‌డ్డాడు. తీరా ఆయ‌న ఓటు వేసే స‌మ‌యం రావ‌డంతో వేలికి ఇంక్ వేస్తుండ‌గానే గుండెపోటుతో కుప్ప‌కూలిపోయి అక్క‌డికక్క‌డే మృతిచెందాడు.