హోట‌ల్‌లో బ‌స చేసిన మోదీ.. బిల్లు క‌ట్ట‌లేదంటూ యాజ‌మాన్యం ర‌చ్చ‌

mysore hotel says narendra modi's hotel bill was not cleared by officials

 

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (Narendra Modi) బ‌స చేసిన హోట‌ల్‌లో బిల్లులు చెల్లించ‌లేదంటూ ఆ హోట‌ల్ యాజ‌మాన్యం రచ్చ‌కు దిగింది. 2023లో ప‌ని నిమిత్తం మోదీ క‌ర్ణాట‌క‌లో పర్య‌టించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న మైసూరులోని రాడిస‌న్ బ్లూ ప్లాజా హోట‌ల్‌లో బ‌స చేసారు. ప్రాజెక్ట్ టైగ‌ర్ ఈవెంట్ 50 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన కార్య‌క్ర‌మంలో మోదీ పాల్గొనాల్సి వ‌చ్చింది. అయితే.. మోదీ బ‌స‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్ల‌ను మైసూరు అట‌వీ శాఖ అధికారులు చూసుకున్నారు.

అయితే మోదీ బ‌స చేసి వెళ్లిపోయాక మాత్రం బిల్లులు చెల్లించ‌లేద‌ట‌. దాదాపు రూ.80 ల‌క్ష‌ల బిల్లు ఇంకా బాకీ ఉందంటూ వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆ బిల్లు త్వ‌ర‌గా క్లియ‌ర్ చేయ‌క‌పోతే లీగ‌ల్ నోటీసులు ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. దాదాపు మూడు రోజుల పాటు మోదీ హోట‌ల్‌లో బ‌స చేసారు. ఈ కార్యక్ర‌మం మొత్తానికి అయిన ఖ‌ర్చు రూ. 6.3 కోట్లు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం రూ.3.3 కోట్లు మాత్ర‌మే విడుద‌ల చేసింద‌ట‌. మిగ‌తా డ‌బ్బు విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో అధికారులు హోట‌ల్ బిల్లులు చెల్లించ‌లేక‌పోయారు.