Lifestyle: చిన్న ఎఫైర్ వ‌ల్ల నా భ‌ర్త అనుమానిస్తూనే ఉన్నాడు.. ఏం చేయాలి?

my husband is so insecure about me all the time

Lifestyle:  నా ఆఫీస్ కొలీగ్‌తో కొంత‌కాలం పాటు చిన్న ఎఫైర్ న‌డిచింది. ఆ త‌ర్వాత అది త‌ప్ప‌ని తెలిసి దూరంగా ఉంటున్నా. ఈ విష‌యం నా భ‌ర్త‌కు తెలిసిన‌ప్ప‌టి నుంచి నేను ఏ త‌ప్పూ చేయ‌క‌పోయినా న‌న్ను అనుమానిస్తూనే ఉన్నాడు. నా ఫోన్లు చెక్ చేస్తుంటాడు. నేను ఆఫీస్‌కి వెళ్లే స‌మ‌యంలో ఎక్క‌డున్నావ్ అంటూ బూతులు తిడుతూ ఉంటాడు. ఇంటికి వ‌చ్చాక గొడ‌వ‌ప‌డ‌తాడు. అత‌నికి మ‌ళ్లీ నాపై న‌మ్మ‌కం క‌ల‌గాలంటే ఏం చేయాలి?

నిపుణుల స‌ల‌హా: మీది చాలా క్లిష్ట‌మైన ప‌రిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్లుంది మీ దుస్థితి ఇప్పుడు. మీకు వివాహ‌మైంద‌ని తెలిసీ మ‌రో వ్య‌క్తితో అఫైర్ ఎందుకు పెట్టుకున్నారు? ఆ విష‌యం మీ భ‌ర్త‌కు మీరే చెప్పారా? లేదా ఇత‌రుల ద్వారా తెలిసిందా? ఏది ఏమైన‌ప్ప‌టికీ మీ భ‌ర్త‌కు మీపై మ‌ళ్లీ న‌మ్మ‌కం రావాలంటే చాలా స‌మ‌యం ప‌డుతుంది. అలాగ‌ని అత‌ను మిమ్మ‌ల్ని హింసిస్తుంటే భ‌రించాల్సిన అవ‌స‌రం మీకు లేదు. ఈ విష‌యాన్ని మీ పెద్ద‌ల‌కు చెప్పండి. వారు చెప్తే మీ భ‌ర్త త‌ప్ప‌కుండా వింటారు అనిపిస్తుంది. వాళ్లు చెప్పినా విన‌కపోతే కౌన్సిలింగ్ ఇప్పించండి. కొన్నిసార్లు మ‌నం చేసే త‌ప్పుల వ‌ల్లే మ‌న జీవితంలో ఉన్న వ్య‌క్తులు విల‌న్లుగా మారుతుంటారు అన‌డానికి ఇదే స‌రైన ఉదాహ‌ర‌ణ‌.