Salaar 2: ఆగిపోయిన స‌లార్ 2

salaar 2 shelved

Salaar 2: ప్రభాస్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న స‌లార్ 2 సినిమా ఆగిపోయింద‌న్న టాక్ వినిపిస్తోంది. స‌లార్ సినిమాతో ప్ర‌భాస్‌కి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చాడు ప్ర‌శాంత్. దీని రెండో భాగం శౌర్యాంగ ప‌ర్వంగా రాబోతోంది. అయితే ప్ర‌స్తుతానికైతే సినిమా ఆగిపోయింద‌ని తెలుస్తోంది. ప్ర‌శాంత్ నీల్‌కి ప్ర‌భాస్‌కి మ‌ధ్య క్రియేటివిటీ విష‌యంలో ఇబ్బందులు వ‌చ్చిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.

దాంతో ఇక ప్ర‌శాంత్ నీల్ ఎన్టీఆర్‌తో చేయ‌బోయే సినిమాపై ఫోకస్ చేస్తున్నార‌ట‌. ఈ సినిమా షూటింగ్ ఆగ‌స్ట్ నుంచి మొద‌లుకానుంది. ఈ సినిమాకు డ్రాగ‌న్ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ర‌ష్మిక మంద‌న‌ హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ ఉంది.