Seethakka: మంత్రి పదవి నుంచి తొలగించి.. పీసీసీ చీఫ్ పోస్ట్
Seethakka: తెలంగాణ మంత్రి దనసరి అనసూయ అలియాస్ సీతక్కను మంత్రి పదవి నుంచి తప్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి పదవి నుంచి తొలగించి ఆమెకు పీసీసీ చీఫ్ పోస్ట్ ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం 10 మంది ఆశిస్తుండగా వాళ్లందరికి చెక్ పెట్టేందుకు సీతక్క పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం. మహిళ, ఆదివాసీ కావడంతో ఆమెను వ్యతిరేకించలేరని అధిష్టానం ఎత్తుగడ వేసినట్లుంది.