Buddha Venkanna: కొడాలి నాని వంశీలను ఎన్టీఆర్ ఖండించకపోవడానికి కారణం ఏంటి?
Buddha Venkanna: జూనియర్ ఎన్టీఆర్‌కి తెలుగు దేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు తెలుగు దేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు తెలుగు దేశం పార్టీ ఓడిపోతేనే ఆ పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కి వెళ్తాయని పలుమార్లు కామెంట్స్ చేసారు. ఈ నేపథ్యంలో బుద్ధా వెంకన్న వారి వ్యాఖ్యలపై స్పందించారు.
“” అసలు తెలుగు దేశం పార్టీకి ఎన్టీఆర్‌కి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడుని తిట్టినా.. భువనేశ్వరిని తిట్టినా ఆయన ఏనాడూ బయటికి వచ్చి ఖండించలేదు. ఏమన్నా అంటే చాగంటి కోటేశ్వరరావులాగా పంచాంగం చెప్పినట్లు చెప్పి వెళ్లిపోతాడు. కొడాలి నాని, వంశీలు మాటి మాటికీ ఎన్టీఆర్ పేరు ప్రస్తావిస్తున్నా ఆయన ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. నేను సినిమా రంగంలోనే ఉంటాను దయచేసి నా పేరును రాజకీయాల్లోకి లాగద్దు అని కూడా చెప్పడంలేదు. దీని అర్థం ఏంటంటే.. ఆయన పరోక్షంగా వారిని సపోర్ట్ చేస్తున్నట్లే అనుకోవాలి “” అని అన్నారు.