Janhvi Kapoor: నా బాయ్‌ఫ్రెండ్ ఫోన్ చెక్ చేస్తుంటా

Janhvi Kapoor says she checks boyfriend shikhar pahariya phone

Janhvi Kapoor:  సాధార‌ణంగా రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌వారు ఒక‌రి ఫోన్లు ఒక‌రు చెక్ చేస్తూ ఉంటారు. కొంద‌రేమో అనుమానంతో చెక్ చేస్తారు.. ఇంకొంద‌రు త‌మ పార్ట్‌న‌ర్ ఎక్క‌డ దూరం అయిపోతారో అనే ఇన్‌సెక్యూరిటీతో చెక్ చేస్తుంటారు. ఈ కోవ‌కే చెందుతారు న‌టి జాన్వి కపూర్. జాన్వి తాను చ‌దువుకుంటున్న రోజుల నుంచి శిఖ‌ర్ ప‌హారియా అనే యువ‌కుడితో ప్రేమ‌లో ఉన్నారు. తాను శిఖ‌ర్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు ఇటీవ‌ల అత‌ని పేరున్న చైన్ వేసుకుని క‌న్ఫామ్ చేసేసారు కూడా. ఇంకో రెండు మూడేళ్ల‌లో వీరి వివాహం జ‌ర‌గ‌నుంది.

మిస్ట‌ర్ అండ్ మిస్ మ‌హి అనే సినిమాతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న జాన్వి. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా త‌న ప్రియుడి గురించి ఆసక్తిర‌మైన అంశాల‌ను వెల్ల‌డించారు. తాను కూడా శిఖ‌ర్ ఫోన్ చెక్ చేస్తుంటాన‌ని తెలిపారు. తాను మాత్ర‌మే కాదు.. అంద‌రు ఆడ‌వాళ్లకు త‌మ ప్రియుళ్ల ఫోన్లు చెక్ చేసే హ‌క్కు ఉంటుంద‌ని అన్నారు. అయితే ఈ హ‌క్కు అబ్బాయిల‌కు లేదు అని కూడా చెప్ప‌డంతో ఆమెపై ట్రోల్స్ పేలుతున్నాయి.