అల్లు అర్జున్​తో​ పెళ్లికి స్నేహారెడ్డి తండ్రి ఒప్పుకోలేదా?

గంగోత్రి సినిమాతో మెగా కాంపౌండ్​ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనా స్టైలిష్​ స్టార్​గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వరుస సినిమాలతో ఆట్టుకుని ఐకాన్​ స్టార్​గా పేరు తెచ్చుకున్న బన్నిఇరవై ఏళ్లుగా పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. సుకుమార్​ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను అలరించి పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగారు. ఇక, బన్నీ తాజాగా(ఏప్రిల్​ 08) తన 41 పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసింది చిత్రబృందం. అయితే బన్నీ పుట్టినరోజు సందర్భంగా తనకు సంబంధించిన ఎన్నో తెలియని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక, అల్లు అర్జున్​, స్నేహరెడ్డి టాలీవుడ్​లోనే పాపులర్​ కపుల్​. వీరిది ప్రేమ వివాహం అని అందరికీ తెలిసిందే. వీరిద్దరు ఎక్కడ కనపడినా ఫ్యాన్స్​కి పండగే. వీరి పిల్లలు అయాన్​, అర్హ సంగతులను ఇద్దరూ సోషల్​ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతారు. అయితే పెళ్లి విషయంలో అల్లు అర్జున్​ని స్నేహ రెడ్డి తండ్రి చాలా దారుణంగా అవమానించారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. అల్లు రామలింగయ్య మనవడిగా, అల్లు అరవింద్​ కొడుకుగానే కాకుండా హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్​ సంపాదించుకున్న బన్నీతో స్నేహరెడ్డి పెళ్లి చెయ్యడానికి ఆమె తండ్రి చంద్రశేఖర్​ రెడ్డి నిరాకరించారట.

అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ఇద్దరూ కొన్నాళ్లపాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు బన్నీ తన ప్రేమ విషయాన్ని నిర్భయంగా ఇంట్లో చెప్పారట. కానీ స్నేహ రెడ్డి మాత్రం కొన్ని రోజులు ఇంట్లో ఆ విషయాన్ని దాచారట. అయితే ఓ రోజు అల్లు అరవింద్ తన కొడుకు పెళ్లి విషయం మాట్లాడడం కోసం స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి వచ్చారట. కానీ ఆయన మాత్రం ‘మీ కొడుకుని మా ఇంటి అల్లుడుగా చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను సినిమా వాళ్ళకి నా కూతురుని ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం లేదు’ అంటూ అరవింద్​ మొహం మీదే చెప్పేశారట. దాంతో అల్లు అరవింద్ చేసేదేం లేక ఇంటికి వెళ్లారట. కానీ స్నేహ రెడ్డి మాత్రం పెళ్లి చేసుకుంటే అల్లుఅర్జున్ నే చేసుకుంటాను అని పట్టుబట్టి కూర్చోవడంతో చంద్రశేఖర్ రెడ్డి చేసేదేమీ లేక కూతురు మాటకి కట్టుబడి అల్లు అర్జున్ తో పెళ్లికి ఒప్పుకున్నారు. మొత్తం మీద అలా అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల పెళ్లి 2011 మార్చ్ 6న చాలా ఘనంగా జరిగిందన్నమాట. ఇప్పుడు ఈ జంట టాలీవుడ్​లోనే టాప్​ సెలబ్రిటీ కపుల్​గా నిలుస్తున్నారు. సినిమాలతోపాటు ఫ్యామిలీని బ్యాలెన్స్​ చేస్తూ సక్సెస్​ఫుల్​గా రాణిస్తున్నారు బన్నీ.