“హేమ” బాబోయ్! పేరు మార్చుకుని.. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుని.. !
Hema: సాంప్రదాయినీ.. సుప్పినీ.. సుద్దపూసనీ… ఈ డైలాగ్ ఇప్పుడు ప్రముఖ నటి హేమకు బాగా సరిపోతుంది. మొన్న ఆదివారం బెంగళూరులోని రేవ్ పార్టీకి వెళ్లడమే కాకుండా.. తాను అసలు వెళ్లలేదని బెంగళూరులోని తన ఫాం హౌస్లో ఉన్నానని వీడియో రిలీజ్ చేసి అడ్డంగా దొరికిపోయింది. ఎందుకంటే ఆ వీడియోలో హేమ వేసుకున్న డ్రెస్సే రేవ్ పార్టీకి వేసుకుని వెళ్లింది అంటూ బెంగళూరు పోలీసులు ఓ ఫోటో రిలీజ్ చేసారు. దాంతో హేమ అడ్డంగా దొరికిపోయారు.
పేరు మార్చుకుని..
హేమ అసలు పేరు కృష్ణవేణి. ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చాక హేమ అని మార్చుకున్నారు. ఈ రేవ్ పార్టీకి వెళ్లేందుకు కృష్ణవేణి అని ఉన్న ఐడీని చూపించి వెళ్లారు. పైగా ఈ రేవ్ పార్టీకి ఎంట్రీ టికెట్ ధర అక్షరాలా రూ.40 లక్షలు.
డ్రగ్స్ సేవించి..
అయితే.. రేవ్ పార్టీకి వెళ్లివారిలో దాదాపు 100 మందిపై పోలీసులు నార్కోటిక్స్ పరీక్షలు నిర్వహించారు. 100 మందిలో దాదాపు 83 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వారిలో హేమ కూడా ఉన్నారని బెంగళూరు పోలీసులు తెలిపారు.
హేమ ఎక్కడున్నారు?
నిన్నటి వరకు వరుసగా మీడియా వాళ్లతో మాట్లాడుతున్నానని.. తనను పోలీసులు అదుపులోకి తీసుకుని ఉంటే మీడియా వాళ్లతో ఫోన్లో ఎలా మాట్లాడతానని ఆగ్రహం వ్యక్తం చేసారు. రెండు రోజులు సమయం ఇవ్వండి.. నన్ను బద్నాం చేస్తున్నవారి అంతు చూస్తాను అని హెచ్చరించిన హేమ ఇప్పుడు మొత్తానికే కనిపించకుండా పోయారు.