Kiraak RP: ఆ ఎమ్మెల్యే జూనియ‌ర్ ఎన్టీఆర్ కంటే గొప్ప‌వాడా?

Kiraak RP slams tenali mla siva kumar for slapping a voter

Kiraak RP: ప్ర‌ముఖ కమెడియ‌న్, తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త కిర్రాక్ ఆర్పీ.. తెనాలి ఎమ్మెల్యే శివ‌కుమార్, మాచర్లకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ నేత పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిలపై మండిప‌డ్డారు. ఓటింగ్ స‌మ‌యంలో లైన్‌లో రావ‌చ్చు క‌దా స‌ర్ అని అడిగిన ఓట‌ర్‌ను ప‌ట్టుకుని శివ‌కుమార్ చెంప‌పై కొట్టాడ‌ని.. దాంతో ఆ ఓట‌రు గొట్టిముక్క‌ల సుధాక‌ర్ కూడా శివ‌కుమార్‌పై చేయి చేసుకున్నాడ‌ని అప్ప‌టి ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు.

సుధాక‌ర్ కాబ‌ట్టి చెంప‌పై కొట్టి ఊరుకున్నాడ‌ని.. అదే తాను ఉండి ఉంటే దుస్తులు ఊడ‌దీయించి పై నుంచి కింద దాకా చెప్పుతో కొట్టేవాడినని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. జూనియ‌ర్ ఎన్టీఆర్, నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ర్యాద‌గా లైన్‌లో వ‌చ్చి మ‌రీ ఓటు హ‌క్కు వినియోగించుకున్నార‌ని.. శివ‌కుమార్ ఎన్టీఆర్, బాల‌కృష్ణ కంటే తోపా అని ప్రశ్నించారు. ఓడిపోతున్నార‌ని తెలిసింది కాబ‌ట్టే ప్ర‌జ‌ల‌పై దాడులు చేస్తున్నార‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.