చంద్రబాబుపై వెంకట్‌రెడ్డి కామెంట్స్.. TDP గెలుపుకు సంకేతమా?
Telangana: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తెలుగు దేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడుపై (Chandrababu Naidu) చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ (కూటమి) గెలుపును ప్రతిబింబిస్తున్నాయి.
అసలు మ్యాటర్ ఏంటంటే.. నిన్న భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ దేశంలోనే అత్యంత పనికిమాలిన ముఖ్యమంత్రి అని కామెంట్ చేసారు. దాంతో వెంకట్‌రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్, కేటీఆర్‌ల విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేసారు.
ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి.. చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావించారు. హైదరాబాద్‌లో సైబర్ టవర్స్‌ను తీసుకొచ్చి ఐటీని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు అయితే.. దాని అభివృద్ధిని కొనసాగించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రత్యర్ధులు మంచి పనులు చేస్తున్నా నలుగురిలో అస్సలు ఒప్పుకోరు.
అలాంటిది వెంకట్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిళ ప్రచారం చేస్తూ కడప ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో.. ఏపీలో కాంగ్రెస్‌కు ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగు దేశం పార్టీ అధినేత గురించి గొప్పగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ఎన్నికల్లో కూటమే గెలవబోతోందని వెంకట్‌రెడ్డి పరోక్షంగా ఒప్పుకున్నట్లే అనే టాక్ వినిపిస్తోంది.