16 ఏళ్ల బాలుడితో ఎఫైర్.. పోలీసులకు చుక్కలు చూపించిన యువతి
Viral News: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ 25 ఏళ్ల యువతి పోలీసులకు చుక్కలు చూపించింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన 15 ఏళ్ల బాలుడితో ఎఫైర్ పెట్టుకుని ఇప్పుడు ఆ అబ్బాయితోనే కలిసి ఉంటానని కూర్చుంది. సోషల్ మీడియాలో ఆ బాలుడు.. యువతి కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమ పేరుతో బాలుడి అడ్రెస్ తెలుసుకుని కొన్ని రోజులుగా ఆమె వాళ్లింట్లోనే ఉంటోంది. దాంతో బాలుడి తల్లిదండ్రులు షాకయ్యారు. రెండు రోజుల్లో ఆమే వెళ్లిపోతుంది అని వదిలేసారు. ఈ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందని ఊరుకున్నారు.
కానీ ఎన్ని రోజులైనా ఆమె ఇంట్లో నుంచి వెళ్లడం లేదు. పైగా ఎప్పటికైనా ఆ బాలుడిని పెళ్లి చేసుకుని అదే ఇంట్లో ఉండాల్సిందేగా అని వారించింది. ఇక లాభం లేదనుకుని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు ఆమెకు నచ్చజెప్పి కౌన్సిలింగ్ ఇప్పించినా కూడా వినలేదు. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని.. కాదని బలవంతంగా పంపించాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. యువతి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని పోలీసులు వారికి సమాచారం అందించారు. వాళ్లు కూడా రాకపోతే ఆ యువతిని మహిళ వసతి గృహానికి తరలిస్తామని పోలీసులు తెలిపారు.