SVSN Varma: త‌క్కువ స‌మ‌యంలోనే ప‌వ‌న్‌తో ల‌వ్‌లో ప‌డ్డా

SVSN Varma interesting comments on pawan kalyan

 

SVSN Varma:  పిఠాపురం తెలుగు దేశం పార్టీ నేత ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ‌.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. తెలుగు దేశం పార్టీ నుంచి పిఠాపురంలో వ‌ర్మ పోటీ చేయాల్సి ఉంది. కానీ కూట‌మిలో భాగంగా ప‌వ‌న్ పిఠాపురాన్ని ఎంచుకోవడంతో వ‌ర్మ ఆ సీటును త్యాగం చేయ‌క త‌ప్ప‌లేదు. ముందు పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాన‌ని అన్నారు. ఆ త‌ర్వాత తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వ‌ర్మ‌ను పిలిచి న‌చ్చ‌జెప్ప‌డంతో ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు తెలిపారు.

ఈ నెల రోజుల్లో ప‌వ‌న్‌తో త‌న జ‌ర్నీ ఎలా ఉందో వివ‌రించారు వ‌ర్మ‌. ప‌వ‌న్‌తో త‌న‌కు అస‌లు ప‌రిచ‌యం లేద‌ని.. ఆయ‌న్ను క‌లిసిన‌ప్పుడు ముందు భ‌య‌ప‌డ్డాన‌ని వ‌ర్మ తెలిపారు. ఆయ‌న‌తో జ‌ర్నీ చాలా స్నేహ‌పూర్వ‌కంగా, ఆప్యాయంగా సాగింద‌ని తెలిపారు. త‌క్కువ స‌మ‌యంలోనే ప‌వ‌న్‌తో ల‌వ్‌లో ప‌డ్డాన‌ని చ‌మ‌త్క‌రించారు.