AP Elections: TTD ఛైర్మెన్ పదవి జనసేనకే?
AP Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి గెలిస్తే.. ఆ క్రెడిట్ అంతా జనసేనాని పవన్ కళ్యాణ్‌కే వెళ్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని.. మార్పు తెచ్చే ప్రభుత్వం రావాలని ఆయన కూటమిలో భారతీయ జనతా పార్టీని చేర్చడంలో పెద్ద పీట వేసారు. కూటమి గెలవాలని.. రాష్ట్రం బాగుపడాలన్న ఒక్క కారణంతోనే ఆయన ఏ సీటు ఇస్తే అది తీసుకున్నారు.. ఏ నియోజకవర్గం వదులుకోమంటే అది వదులుకున్నారు. ఎక్కడా కూడా నాకు ఇది కావాలి అని అడిగింది లేదు. అలాంటి పవన్‌కు క్రెడిట్ దక్కకపోతే ఎలా?
ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కూటమి అధికారంలోకి రాగానే.. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి జనసేన పార్టీలోని అభ్యర్ధికే ఇవ్వాలని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.