KTR: ముందే చెప్పాం.. కాంగ్రెస్ ఓటేసి బుక్కయ్యారు
KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని ఓ నెటిజన్ చిరాగ్గా ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా ట్యాగ్ చేయడంతో కేటీఆర్ సెటైర్ వేస్తూ ఆ నెటిజన్‌కు రిప్లై ఇచ్చారు. ఇంతకీ ఆ నెటిజన్ ఏమన్నాడంటే.. “” భారత రాష్ట్ర సమితి పవర్లో లేకుండాపోయింది.. మా ఇంట్లో పవర్ పోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి “” అని ట్వీట్ చేసాడు. ఇందుకు కేటీఆర్ సమాధానం ఇస్తూ.. “” ఎన్నికలకు ముందే స్పష్టంగా చెప్పాము కదా శివ గారు.. మీకు “కాంగ్రెస్ కావాలా, కరెంటు కావాలా“ తేల్చుకోండి అని. మార్పు మార్పు అన్నారు, 2014 కంటే ముందటి చీకటి రోజులు మళ్ళీ తెచ్చారు కాంగ్రెస్ వాళ్ళు “” అని సెటైర్ వేసారు.