భూమిని కబళించేయనున్న సూర్యుడు..ఎప్పుడు? ఎలా?
అప్పుడెప్పుడో 2012లో భూమి అంతమైపోతుంది అన్నారు. ఆ సమయంలో 2012 పేరుతో ఓ హాలీవుడ్ సినిమాను కూడా తీసి ప్రజలను తెగ భయపెట్టారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడు మరో అంశాన్ని శాస్త్రవేత్తలు ప్రచారం చేస్తున్నారు. అదేంటంటే.. భూమిని సూర్యుడు కబళించేయనున్నాడట. అది ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? వంటి విషయాలను తెలుసుకుందాం.
సూర్యుడు భూమిని కబళించేయడం అనేది 5 బిలియన్ సంవత్సరాల తర్వాత జరగబోతోంది. విశ్వంలో అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టేసారు. సాటిలైట్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. నేచర్ జియో సైన్స్‌లో ప్రచురించబడిన ఓ నివేదికలో మరో 5 బిలియన్ సంవత్సరాల్లో సూర్యుడే భూమిని కబళించేయనున్నాడు అని రాసుంది.
ఇలా ఎందుకు జరబోతోందంటే.. సూర్యుడిపై రేడియేషన్ ప్రభావం రోజురోజుకీ పెరిగిపోతోంది. దీని వల్ల భూమిపై ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతాయి. తద్వారా భూమిపై ఉండే నీరంతా ఆవిరైపోతుంది. ఆక్సిజన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఈ విపరీతమైన రేడియేషన్, ఉష్ణోగ్రతలు కేవలం భూమిని మాత్రమే కాదు మెల్లిగా మిగతా గ్రహాలను కూడా అంతరించిపోయేలా చేస్తాయి. ఐస్ అంతా కరిగిపోయి మరో ఐసేజ్ యుగం రాబోయే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.