పోలింగ్ వేళ యువ‌కుడి అత్యుత్సాహం.. 8 సార్లు ఓటేసి..

a boy votes 8 times

Viral News: పోలింగ్ స‌మ‌యంలో ఓ యువ‌కుడు అత్యుత్సాహం చూపించాడు. మ‌ర్యాద‌గా ఓటేసి రాకుండా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి ఓటేస్తున్న స‌మ‌యంలో వీడియో రికార్డు చేయ‌డ‌మే కాకుండా భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఏకంగా ఎనిమిది సార్లు ఓటేసాడు.  ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ఈటాలో చోటుచేసుకుంది. నిందితుడు ర‌జ‌న్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న ఫారూఖాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో చోటుచేసుకుంది. విష‌యం బ‌య‌టికి రావ‌డంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిప‌డ్డారు.  ఇలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ఈ అంశాల‌పై భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌క్ష‌పాతం చూపిస్తోంద‌ని అన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.