Hyderabad: భర్తపై దాడి.. రెచ్చిపోయిన భార్య!
Hyderabad: ఓ వ్యక్తి మద్యం కొనేందుకు వైన్ షాప్‌కు వెళ్లగా.. అక్కడ అతనిపై షాపు సిబ్బంది తల పగలగొట్టి దాడి చేసారు. విషయం అతని భార్యకు తెలీడంతో ఆమె రెచ్చిపోయింది. మా ఆయన్నే కొడతారా అంటూ విశ్వరూపం చూపించింది. ఏకంగా పోలీసులనే జుట్టు పట్టుకుని చితకబాదింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భర్తకు రక్తం కారుతుండడంతో వైన్ షాపులోకి చొరబడి సిబ్బందిపై దాడి చేసింది. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను జుట్టు పట్టుకుని మరీ చితకబాదింది. ఆ తర్వాత పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని మూడు కేసులు నమోదు చేసారు.